![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -672 లో.... బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఆఫీషియల్ గా జ్యోత్స్నని సీఈఓగా శివన్నారాయణ చెప్పాలని అనుకుంటాడు. నాకు అభ్యతరం ఉంది నాన్న అని దశరథ్ అంటాడు. మీతో పర్సనల్ గా మాట్లాడాలని పక్కకీ తీసుకొని వెళ్తాడు. గతంలో జ్యోత్స్న చేసిన తప్పు గురించి మనకి తెలుసు అయిన తనకే బాధ్యతలు అప్పగించడం కరెక్ట్ కాదని దశరథ్ అంటాడు. నా కోడలు మొహంలో సంతోషం చూడాలంటే ఇంతకి మించి వేరే మార్గం లేదని శివన్నారాయణ చెప్తాడు.
నేను చెప్పినట్టు చేయండి అని దశరథ్ అంటాడు. అప్పుడే కార్తీక్ వచ్చి మావయ్య చెప్పింది కరెక్టే తాత అని కార్తీక్ అంటాడు. మరొకవైపు అందరు మాట్లాడుకొని ఏం నిర్ణయం తీసుకుంటారోనని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత అందరు తిరిగి మీటింగ్ కి వస్తారు. సీఈఓగా ఒక కొత్త మనిషిని అనుకున్నామని దశరథ్ అంటాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఎవరు అని బోర్డు మెంబర్స్ అడుగుతారు. ఎవరో చెప్పడం ఎందుకు.. వస్తుంది చూడండి అని దశరథ్ అంటాడు. ఆ తర్వాత పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. అందరు తను సీఈఓ అని అనుకుంటారు. పారు కొంచెం పక్కకి జరిగితే వెనకాల ఉన్న వాళ్ళు ముందుకి వస్తారని కార్తీక్ అంటాడు. అప్పుడు దీప ఎంట్రీ ఇస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. దీప కూర్చోమని దశరథ్ అంటాడు. కాఫీ లు అందించే వాళ్ళు ఇక్కడ ఎందుకు అని జ్యోత్స్న అంటుంది. తనే కొత్త సీఈఓ అని దశరథ్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏంటి దీపని సీఈఓని చేయడానికా అర్జెంట్ గా తీసుకొని రమ్మంది అని పారిజాతం అంటుంది.
నాకు ఇష్టం లేదని జ్యోత్స్న అంటుంది. దీపకి అన్ని బాధ్యతలు తెలుసు తను అయితే సమర్థవంతగా లీడ్ చేస్తుందని దశరథ్ అంటాడు. అందరి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా అని జ్యోత్స్న అంటుంది. సరే అందరు చీటిలలో జ్యోత్స్న, దీప ఎవరు సీఈఓ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు రాయండి అని శివన్నారాయణ చెప్తాడు. ఇద్దరికి చెరొక మూడు ఓట్లు వస్తాయి మిగతా చీటీలో ఎవరి నేమ్ వస్తుందోనని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |